కృష్ణా: బంటుమిల్లి మండలం అర్తమూరు సమీపంలో నిన్న అర్ధరాత్రి జరిగిన ప్రమాదంలో కుమ్మరిపాలెంకు చెందిన నిడుమోలు శివ (35) మృతి చెందాడు. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోవడంతో అతను ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న బంటుమిల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
హిట్ అండ్ రన్.. వ్యక్తి మృతి


