NDL: సంజామల మండలానికి చెందిన ఫిజికల్ డైరెక్టర్ భాష జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి రెండు స్వర్ణ పతకాలు సాధించారు. ఈ విజయంతో జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించారు. భాషను పలువురు అధికారులు, నాయకులు అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
జాతీయస్థాయి అథ్లెటిక్స్‌కు భాష ఎంపిక


