హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పేకాట శిబిరంపై దాడి... 8 మంది అరెస్ట్

కోనసీమ: ఆత్రేయపురం మండలం నార్కెడిమిల్లి గ్రామ శివారులో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో సీఐ విద్యాసాగర్ ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.15,100 నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై బి. శ్రీనివాసరావు తెలిపారు.