W.G: రొయ్యల సాగులో అధిక దిగుబడులు, లాభాలు సాధించాలంటే వ్యాధుల నివారణ, నీటి నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని నిపుణులు సూచించారు. నరసాపురంలోని YN కళాశాలలో సోమవారం రొయ్యల ఆరోగ్యం, వ్యాధుల నిర్వహణపై ఒకరోజు కార్యశాల నిర్వహించారు. నాణ్యమైన పిల్లల ఎంపిక, జీవ భద్రత, మేత యాజమాన్యం, ఆక్సిజన్ స్థాయుల పర్యవేక్షణతో వ్యాధులను నియంత్రించవచ్చని విర్బాక్ ప్రతినిధులు వివరించారు.
ఆంధ్రప్రదేశ్
రొయ్యల రైతులకు నిపుణుల కీలక సూచనలు


