హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శబరిమలకు అద్దె ప్రాతిపదికన బస్సులు ఏర్పాటు

KKD: శబరిమల వెళ్లే భక్తుల సౌకర్యార్థం కాకినాడ జిల్లాలోని మూడు డిపోల నుంచి అద్దెకు సూపర్ లగ్జరీ బస్సులు నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి కె.రమేష్ తెలిపారు. ఈ మేరకు సోమవారం డీపీటీవో కార్యా లయంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. డిపో మేనేజర్ జీఆర్ఎల్ దేవి, అసిస్టెంట్ మేనేజర్లు టి. బాలకృష్ణ, ఎ. మాలిమ్బిషా, పీఆర్వో సిహెచ్.వెంక టరావు, సిబ్బంది పాల్గొన్నారు.