KRNL: ఉమ్మడి జిల్లాలో అగ్రిగోల్డ్ బాధితుల బాండ్ల పరిశీలన, నమోదు ప్రక్రియ ఈ నెల 17 వరకు కొనసాగుతుందని సీఐడీ అదనపు ఎస్పీ ఎన్. పూజిత సోమవారం తెలిపారు. కర్నూలు సీఐడీ కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు నమోదు చేస్తామన్నారు. గూడూరు, మిడుతూరు, పగిడ్యాల బాధితులు 13న, సిరివెళ్ల, ఓర్వకల్లు బాధితులు 14 నుంచి 17 వరకు సంబంధిత పత్రాలతో హాజరుకావాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలనకు గడువు


