అన్నమయ్య: జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్‌ను తప్పనిసరిగా పాటించాలని DEO షంషుద్దీన్ స్పష్టం చేశారు. దసరా సెలవుల్లో పాఠశాలలు నిర్వహించకూడదని విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే తల్లిదండ్రులు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. పాఠశాలల నిర్వహణపై ఎంఈవోలు, డిప్యూటీ ఈవోలు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
సెలవుల్లో స్కూళ్లు నిర్వహిస్తే చర్యలు: DEO


