VSP: ఎన్ఎంఎంఎస్ ఉపకార వేతన పరీక్ష రుసుము చెల్లింపు గడువును ఈనెల 29 వరకు పొడిగించినట్లు డీఈఓ ప్రేమకుమార్ తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు తెలియజేసి ఎక్కువ మంది పరీక్షకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. వివరాలకు విద్యాశాఖ కార్యాలయ పరీక్షల విభాగంలో సంప్రదించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'NMMS రుసుము గడువు పెంపు'


