హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జిల్లాలో టూరిజం ద్వారా రూ.579 కోట్ల పెట్టుబడులు'

తూర్పు గోదావరి జిల్లాలో ఐదు టూరిజం ప్రాజెక్టుల ద్వారా రూ. 579.26 కోట్ల పెట్టుబడులు రానున్నాయని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. వీటితో దాదాపు 5,265 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కొవ్వూరులో హోటల్, రాజమండ్రిలో ద్వీప రిసార్ట్, కన్వెన్షన్ కేంద్రాలు రానున్నాయని.. దీని ద్వారా జిల్లా మరింత అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.