KKD: తుని రైల్వే స్టేషన్లో విశాఖ ఎక్స్ ప్రెస్ ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు జారిపడి సుమారు 45 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. సోమవారం ప్లాట్ ఫారం వైపు కాకుండా వెనక నుంచి రైలు ఎక్కేందుకు ప్రయత్నించగా ఈ ఘటన జరిగినట్లు జీఆర్పీ ఎస్సై సత్తిబాబు తెలిపారు. మృతుడి వివరాలు తెలియరాలేదని, ఆచూకీ తెలిసిన వారు రైల్వే పోలీసులను సంప్రదించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
తుని రైల్వే స్టేషన్‌లో వ్యక్తి మృతి


