హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇవాళ బెజవాడ దుర్గమ్మ ఏ అలంకారం?

NTR: దేవీ నవరాత్రుల్లో భాగంగా ఇవాళ దుర్గాభవానీ దేవి శ్రీ అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తారు. అన్నపూర్ణాదేవి ఎడమచేతిలో అన్నం ఉన్న బంగారు పాత్ర, కుడిచేతితో గరిటె పట్టుకుని భక్తులకు అభయాన్ని, సర్వసస్య సమృద్ధిని కలిగిస్తారు. ఈ అమ్మవారిని దర్శించుకోవడం వల్ల కరువు కాటకాలు తొలిగి ఆకలి బాధలు నశిస్తాయని నమ్ముతారు.