విశాఖ సముద్రంలో పడి మత్స్యకారుడు గల్లంతయ్యాడు. మైలపల్లికి చెందిన బోటు ఈనెల 9న చేపలరేవు నుంచి వేటకు వెళ్లింది. నిన్న కొయ్యం తీరం వద్ద వేట సాగిస్తుండగా చింతపల్లి రాము ప్రమాదవశాత్తు జలాల్లో పడ్డాడు. సమాచారం అందగానే గాలింపు చేపట్టామని, కోస్టుగార్డును అప్రమత్తం చేశామని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. ఈ ఘటనపై మెరైన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
సముద్రంలో పడి మత్స్యకారుడు గల్లంతు


