ATP: ప్రమాదంలో మృతి చెందిన టీడీపీ కార్యకర్త సల్మాన్ కుటుంబానికి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు ఆర్థిక సాయం అందించారు. అనంతపురం జిల్లా కుందుర్పి మండలం తెనగల్లు గ్రామానికి చెందిన సల్మాన్ ప్రమాదంలో చనిపోవడంతో ఆయన భార్య షీమన్‌కు ప్రజావేదికలో రూ. 25,000 సాయం అందజేశారు. వారి కుటుంబానికి పార్టీ పరంగా ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు.
ఆంధ్రప్రదేశ్
కార్యకర్త కుటుంబానికి సాయం అందించిన ఎమ్మెల్యే


