హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొత్తమ్మతల్లి ఉత్సవాలకు పోలీసు బందోబస్తు

SKLM: కోటబొమ్మాళి‌లో కొత్తమ్మ తల్లి ఉత్సవాల భద్రతా ఏర్పాట్లను జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డి సోమవారం రాత్రి పరిశీలించారు.ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు సుమారు 800 మంది పోలీసు సిబ్బందిని ఏర్పాటు చేశారు.క్యూ లైన్లు, బారి కేడ్లు, పార్కింగ్ స్థలాలు, వీఐపీ భద్రతా ఏర్పాట్ల‌పై అధికారులతో సమీక్షించారు. సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించాలన్నారు.