హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూర్మావతారంలో నరసింహస్వామి దర్శనం

సత్యసాయి: కదిరి ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు కూర్మావతార అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అక్టోబర్ 11 నుంచి 20 వరకు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. ఆలయంలో జరుగుతున్న ఈ వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు.