హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఎంతో రాయదుర్గం ఎమ్మెల్యే భేటీ

ATP: రాయదుర్గం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేశారు. రాయదుర్గంలో సద్భావన భవన్ నిర్మాణానికి రూ. 4 కోట్లు మంజూరు చేయాలని కోరారు. నిరుపేదల సొంతింటి కల నెరవేర్చేందుకు అదనంగా 1,500 పక్కా గృహాలు కేటాయించాలని విన్నవించారు.