హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లేపాక్షి బస్టాండ్‌లో కుక్కల బెడద

సత్యసాయి: లేపాక్షి బస్టాండ్ ఆవరణంలో గుంపులుగా కుక్కలు తిరుగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బస్టాండ్ నుంచి బయటకు వెళ్లేందుకు కూడా ఇబ్బంది పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి, కుక్కల సమస్యను పరిష్కరించాలని లేపాక్షి ప్రజలు కోరుతున్నారు.