హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

SKLM: కవిటి మండలం మాణిక్యపురం పరిధిలో 11 కేవీ ఆర్డీఎస్ పనుల నిమిత్తం మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని యజ్ఞేశ్వరరావు తెలిపారు. ఫీడర్ పరిధిలో బీజీపుట్టుగ, వరక, కుసుంపురం, బల్లిపుట్టుగ, మాణిక్యపురం పంచాయతీల పరిధిలోని అన్ని గ్రామాలకు ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సరఫరా నిలిచిపోతుందని, గృహ, వ్యవసాయ వినియోగదారులు సహకరించాలని కోరారు.