హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్థానిక ఎన్నికల మెటీరియల్ టెండర్లు ఖరారు

ASR: గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ మెటీరియల్ సరఫరా టెండర్‌ను విశాఖపట్నం సూపర్ బజార్‌కు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల మెటీరియల్ టెండర్‌ను విశాఖపట్నం యువ ఎంటర్‌ప్రైజెస్‌కు కేటాయించారు. సోమవారం జాయింట్ కలెక్టర్ శ్రీపూజ సమక్షంలో టెండర్లను ఖరారు చేశారు. ఎన్నికల మెటీరియల్‌ను నిర్ణీత గడువులోగా సంబంధిత మండలాలకు సరఫరా చేయాలని, జాప్యం జరగకూడదని సంస్థలకు సూచించారు.