హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పరిశ్రమల అభివృద్ధి అవకాశాలను గుర్తించాలి'

కృష్ణా: మచిలీపట్నం పోర్టు ఆధారంగా పరిశ్రమల అభివృద్ధికి ఉన్న అవకాశాలను గుర్తించి జిల్లాను ఆర్థికంగా బలోపేతం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. అమరావతి ఆర్థిక ప్రాంత అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనపై ఆయన మచిలీపట్నంలో సమీక్షించారు. జిల్లాలో ఇప్పటికే బలంగా ఉన్న రంగాలతో పాటు కొత్తగా అభివృద్ధి చేయగల రంగాలను వేగంగా గుర్తించాలని తెలిపారు.