కృష్ణా: బంటుమిల్లి ఎస్ఐ ఎం.నాగరాజు, సిబ్బంది నిన్న రాత్రి విస్తృతంగా వాహన తనిఖీలను చేపట్టారు. వాహనానికి సంబంధించిన పత్రాలను, నంబర్ ప్లేట్‌ను స్కాన్ చేసి వాహనాలపై పెండింగ్ చలనాలు ఏమైనా ఉన్నాయా అని పరిశీలించారు. బ్రీత్ అనలైజర్ ద్వారా ఎవరైనా మద్యం తాగి వాహనాన్ని నడుపుతున్నారా అని చెక్ చేశారు. మద్యం తాగి వాహనాన్ని నడపడం వలన జరిగే అనర్థాలను వివరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బంటుమిల్లిలో విస్తృతంగా వాహన తనిఖీలు


