హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉద్యోగాల పేరుతో భారీ మోసం

KRNL: జిల్లాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి రూ.23 లక్షలు వసూలు చేసి మోసం చేశారని బాధితులు నిన్న పోలీస్ PGRSలో ఫిర్యాదు చేశారు. విద్యుత్ శాఖలో ఉద్యోగానికి రూ.14 లక్షలు, ఆదోని వెటర్నరీ శాఖలో ఉద్యోగానికి రూ.5 లక్షలు, కలెక్టరేట్ ఉద్యోగానికి రూ.4 లక్షలు తీసుకున్నారని ఆరోపించారు. ఫిర్యాదులపై విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హామీ ఇచ్చారు.