హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనకాపల్లిలో ఆహ్వాన నాటిక పోటీలు ప్రారంభం

AKP: శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అనకాపల్లి పట్టణంలోని గవరపాలెం శతకంపట్టు వద్ద ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు నిన్న సాయంత్రం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను గౌరీ సేవా సంఘం వేదికపై టీడీపీ రాష్ట్ర నాయకుడు రత్నాకర్ ప్రారంభించారు. నాటికలు ప్రజల్లో చైతన్యాన్ని తీసుకువస్తాయని ఆయన అన్నారు. ఈ పోటీలను విజయవంతం చేయాలని కోరారు.