హైదరాబాద్: 28°C
క్రీడలు

U-17 మహిళల ఆసియా కప్‌కు భారత్ అర్హత

భారత అండర్-17 మహిళల ఫుట్‌బాల్ జట్టు ఆసియా కప్‌కు అర్హత సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. క్వాలిఫైయర్స్‌లో భాగంగా మలేషియాతో జరిగిన చివరి గ్రూపు మ్యాచ్‌లో 4-0 తేడాతో ఏకపక్ష విజయం సాధించింది. దీంతో గ్రూపు-ఈలో 9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. వరుసగా రెండోసారి ఆసియా కప్‌కు భారత్ అర్హత సాధించడం విశేషం.