హైదరాబాద్: 28°C
క్రీడలు

నాలుగో T20లోనూ సూర్యవంశీకి నిరాశే..?

HYD వేదికగా జరగనున్న నాలుగో టీ20లో టీమిండియా తమ విన్నింగ్ కాంబినేషన్‌నే కొనసాగించే అవకాశం ఉంది. సంజూ శాంసన్ విఫలమవుతున్నా, HYDలో మంచి రికార్డు ఉండటంతో అతడికే ఓపెనర్‌గా మళ్లీ అవకాశం దక్కనుంది. దీంతో వైభవ్ సూర్యవంశీకి నిరాశే మిగలనుంది. పిచ్‌ స్వభావాన్ని బట్టి ప్రిన్స్ యాదవ్ స్థానంలో స్పిన్నర్‌గా కుల్దీప్‌ను బరిలోకి దించేందుకు మేనేజ్మెంట్ ఆలోచిస్తోంది.