హైదరాబాద్: 28°C
క్రీడలు

ఏఐటీఏ పదవులకు టెన్నిస్ దిగ్గజాల దరఖాస్తు

ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ క్రీడా పరిపాలనపై టెన్నిస్ దిగ్గజాలు లియాండర్ పేస్, సానియా మీర్జా, మహేష్ భూపతి, రోహన్ బోపన్న ఆసక్తి చూపుతున్నారు. ఏఐటీఏలోని 'స్పోర్ట్స్‌పర్సన్స్ ఆఫ్ అవుట్‌స్టాండింగ్ మెరిట్' స్థానాల కోసం వీరితో పాటు మొత్తం 26 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియ నవంబర్ 5తో ముగుస్తుంది. అనంతరం నవంబర్ 27న ఏఐటీఏ ప్రధాన ఎన్నికలు జరగనున్నాయి.