హైదరాబాద్: 28°C
క్రీడలు

టీమిండియాకు షాక్.. పంత్‌కు గాయం

న్యూజిలాండ్-ఏతో జరగనున్న మూడు మ్యాచ్‌ల అనధికారిక టెస్ట్ సిరీస్‌కు ముందు భారత-A జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ గాయం కారణంగా తొలి రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు. అతడి స్థానంలో యువ వికెట్ కీపర్ కుమార్ కుషాగ్రాను బీసీసీఐ ఎంపిక చేసింది. ఈనెల 24న తొలి మ్యాచ్‌, 31న రెండో మ్యాచ్, నవంబర్ 7న మూడో మ్యాచ్ ప్రారంభం కానున్నాయి.