హైదరాబాద్: 28°C
క్రీడలు

కోహ్లీ రిటైర్మెంట్‌పై జాఫర్ సంచలన వ్యాఖ్యలు

కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సెలక్షన్ కమిటీ ప్రవర్తన పట్ల అసంతృప్తితోనే కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలికి ఉండొచ్చని అభిప్రాయపడ్డాడు. విరాట్ లాంటి స్టార్ ప్లేయర్ మరిన్ని టెస్టులు ఆడే అవకాశం ఉన్నప్పటికీ, అతడిని రిటైర్మెంట్ ప్రకటించేలా చేశారన్నాడు. అయితే కోహ్లీ స్వయంగా నోరు విప్పితే తప్ప అసలు నిజాలు బయటకు రావని తెలిపాడు.