హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాండ్ షరతులు ఉల్లంఘించిన వ్యక్తికి జరిమానా

సత్యసాయి: కదిరిలో సత్ప్రవర్తన బాండ్ షరతులు ఉల్లంఘించిన ప్రదీప్ సింగ్‌కు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ రూ. 25 వేల జరిమానా విధించినట్లు టౌన్ సీఐ బి. వెంకటేశ్వర్లు తెలిపారు. నల్లగుట్ట వీధికి చెందిన ప్రదీప్ సింగ్ ఫిబ్రవరిలో బైండోవర్ అయ్యాడు. గడువు ముగియకముందే మళ్లీ కేసుల్లో పాల్గొనడంతో బాండ్ మొత్తాన్ని జప్తు చేసి ట్రెజరీలో జమ చేసినట్లు పేర్కొన్నారు.