హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జీవీఎంసీ ఎన్నికలకు పటిష్ట ఏర్పాట్లు'

VSP: జీవీఎంసీ ఎన్నికలు–2026 నిర్వహణకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని కౌంటింగ్ కేంద్రాలను కమిషనర్ కేతన్ గార్గ్ సోమవారం పరిశీలించారు. కౌంటింగ్ గదులు, స్ట్రాంగ్ రూములు, రిసెప్షన్, ఆహార కౌంటర్‌లతో విద్యుత్, వెలుతురు, పార్కింగ్ సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అన్ని జోన్‌లలో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను సిద్ధం చేయాలన్నారు.