హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: హైడ్రా ప్రజావాణి కి 56 ఫిర్యాదులు

హైదరాబాద్ బుద్ధ భవన్‌లో సోమవారం నిర్వహించిన హైడ్రా ప్రజావాణికి 56 ఫిర్యాదులు అందినట్లు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు. హైకోర్టు సర్వే ఆర్డర్లు ఉన్న ఆగని నిర్మాణాలు, కట్టడాలు ఆపాలంటూ హైడ్రాకు పలువురు విజ్ఞప్తి చేశారన్నారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించిన హైడ్రా కమిషనర్ వాటిని వెంటనే పరిశీలించి పరిష్కరించాలని హైడ్రా అధికారులను ఆదేశించారు.