MHBD: మరిపెడ(M)పెద్దనాగారం 33/11 కేవీ సబ్‌స్టేషన్‌లో 5 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్ స్థానంలో 8 ఎంవీఏ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. ఈ పనుల కారణంగా అక్టోబర్ 13న ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సబ్‌స్టేషన్ పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. ప్రజలు, రైతులు, వినియోగదారులు సహకరించాలని కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


