హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్లపై ధాన్యం ఆరబోస్తే చర్యలు

NZB: జక్రాన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్లపై మొక్కజొన్న, వరి, ఇతర పంటలను ఆరబోస్తే చర్యలు తప్పవని SI మహేశ్ హెచ్చరించారు. ధాన్యాలు రోడ్లపై ఆరబోయడం వల్ల ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం ఏర్పడి, ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని రైతులు పంటలను రోడ్లపై కాకుండా, సురక్షిత ప్రాంతాల్లో మాత్రమే ఆరబెట్టాలని సూచించారు.