నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ మాతృమూర్తి మృతి పట్ల మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ విచారం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్ రాజకుమారితో కలిసి ఆమె భౌతికకాయానికి పూలమాలలు వేసి సోమవారం నివాళులర్పించారు. అనంతరం ఎస్పీని, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద సమయంలో కుటుంబానికి మనోధైర్యం కలగాలని ప్రార్థించారు.
ఆంధ్రప్రదేశ్
ఎస్పీ సునీల్ షెరాన్ తల్లి మృతి!


