VZM: కొత్తవలస మండలం రెల్లి రెవెన్యూ సర్వే నెంబర్ 21, విస్తీర్ణం 34 సెంట్ల ప్రభుత్వ భూమిని ఓ వ్యక్తి ఆక్రమించి దర్జాగా గోడను నిర్మించారు. ఎమ్మార్వో రామాలక్ష్మీకి సమాచారం అందడంతో స్థానిక విఆర్వో రామానుజంను పంపించి అక్రమంగా నిర్మించిన గోడను పొక్లైన్ సహాయంతో సోమవారం తొలగించారు. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని ఆమె తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రభుత్వ భూమిని కాపాడిన రెవెన్యూ యంత్రాంగం


