హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ఐదుగురు ఎస్సైల బదిలీ

కృష్ణా: జిల్లాలో ఐదుగురు ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీసీఎస్‌ ఎస్సై నాగరాజును కోడూరుకు, వీఆర్‌లో ఉన్న వైవీవీ సత్యనారాయణను గన్నవరానికి, కోడూరు ఎస్సై చాణక్యను ఆర్‌.పేటకు, పెదపారుపూడి ఎస్సై ప్రవీణ్ కుమార్‌ను ఎస్‌బీకి, సుభాషిణిని గుడివాడకు బదిలీ చేశారు.