హైదరాబాద్: 28°C
తెలంగాణ

మహా లింగార్చన‌లో బండి సంజయ్

KNR: కరీంనగర్ మహాశక్తి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. సోమవారం రాత్రి సాయంత్రం నిర్వహించిన లింగార్చన కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. పిండితో లింగాకృతి ప్రతిష్టించి అభిషేకం చేసి దీపాలు వెలిగించారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేశ్ తో పాటు పలువురు నేతలు అమ్మవారిని దర్శించుకున్నారు.