VSP: విశాఖపట్నం సీపీ కార్యాలయంలోని 'ప్రమాద బాధితుల సహాయక కేంద్రం' ద్వారా సోమవారం 12 మంది 'హిట్ అండ్ రన్' బాధితులకు రూ. 6 లక్షల పరిహారం అందజేశారు. ఒక్కొక్కరికి రూ. 50 వేల చొప్పున వారి ఖాతాల్లో నేరుగా జమ చేశారు. ఇప్పటివరకు విశాఖలో 205 మందికి రూ. 1.49 కోట్ల సాయం అందించినట్లు పోలీసులు వెల్లడించారు. పరిహారం కోసం 7995095793 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాద బాధితులకు విశాఖ పోలీసుల సాయం


