హైదరాబాద్: 28°C
క్రీడలు

బీసీసీఐపై గవాస్కర్ ఆగ్రహం..!

ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీకి బీసీసీఐపై ప్రాధాన్యత ఇవ్వకపోవడంపై సునీల్ గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రంజీల సమయంలోనే భారత్-ఏ సిరీస్‌లను షెడ్యూల్ చేయడం వల్ల కీలక ఆటగాళ్లు రాష్ట్ర జట్లకు దూరమవుతున్నారని తప్పుబట్టాడు. దీనివల్ల దేశవాళీ టోర్నీలో పోటీ బలహీనపడి, ఆటగాళ్ల నిజమైన సత్తాను అంచనా వేయడం కష్టంగా మారుతోందని వ్యాఖ్యానించాడు.