హైదరాబాద్: 28°C
క్రీడలు

సౌతాఫ్రికా ముందు భారీ లక్ష్యం

డర్బన్ వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా పట్టుబిగించింది. రెండో ఇన్నింగ్స్ 314/6 వద్ద డిక్లేర్ చేసిన ఆసీస్.. SA ముందు 421 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన మ్యాట్ రెన్షా, రెండో ఇన్నింగ్స్‌లోనూ 82 పరుగులతో మెరిశాడు. లక్ష్య ఛేదనలో SA.. ప్రస్తుతం 59/1 పరుగులు చేసింది. ఆ జట్టు గెలవాలంటే ఇంకా 362 పరుగులు చేయాలి.