హైదరాబాద్: 28°C
తెలంగాణ

పల్లె సేవకు జాతీయ గౌరవం

RR: ఫరూఖ్‌నగర్‌ మండలం గిరాయి గుట్ట తాండా సర్పంచ్‌ పాతలవత్‌ కృష్ణవేణి హరినాయక్‌ బహుజన సాహిత్య అకాడమీ 2026 ఉత్తమ సర్పంచ్‌ జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. గ్రామాభివృద్ధికి ఆమె అందించిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం దక్కింది. న్యూఢిల్లీలో నవంబర్‌ 15న జరిగే 20వ జాతీయ సదస్సులో ఈ అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ ఘనతతో తాండా కీర్తి జాతీయ స్థాయికి చేరింది.