హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాగునీటి సమస్య లేకుండా చూడండి

SRD: జిల్లాలోని ఎనిమిది మున్సిపాలిటీలో తాగునీటి సమస్య లేకుండా చూడాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఉన్న కొద్దిపాటి నీటిని పొదుపుగా వాడుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. నీటి సరఫరా పై ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు.