హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిరిజన గ్రామాల్లో ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ పర్యటన

ASR: జి. మాడుగుల మండలం పరదేసిపుట్టు, పాలమామిడి గ్రామాల్లో ఐటీడీఏ పీవో ఆదిత్య వర్మ సోమవారం పర్యటించారు. అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి, గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పీఎం జన్‌మన్ ఇళ్ల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, తాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారులను ఆదేశించారు. సీసీ రోడ్ల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని సూచించారు.