హైదరాబాద్: 28°C
తెలంగాణ

అర్హులైన మహిళలకు ఆర్థిక సాయం

నిర్మల్: అర్హులైన దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు తదితరులకు ఆర్థిక సాయం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళా, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ తెలిపింది. పథకం వివరాలు, మార్గదర్శకాల కోసం nirmal.telangana.gov.in సందర్శించాలని సూచించింది. తొందరగా దరఖాస్తు చేసుకుని లబ్ధి పొందాలని పేర్కొంది.