NTR: యనమలకుదురులో ఈగల్ టీమ్, స్థానిక పోలీసుల సహకారంతో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఐజీ రవికృష్ణ తెలిపారు. అనుమానాస్పద ప్రాంతాల్లో యువతకు గంజాయి వినియోగంపై యూరిన్ పరీక్షలు చేస్తున్నామన్నారు. పాజిటివ్ వచ్చిన వారిపై కేసులు నమోదు చేసి, డ్రగ్స్ సరఫరా గొలుసును విచ్ఛిన్నం చేయడమే లక్ష్యమన్నారు.
ఆంధ్రప్రదేశ్
గంజాయి వినియోగంపై యూరిన్ పరీక్షలు


