హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రామస్థుల చిరకాల వాంఛ నెరవేర్చిన ఎమ్మెల్యే

NTR: అనాసాగరం గ్రామ ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది. గ్రామస్థుల రవాణా ఇబ్బందులను తొలగించేందుకు ఏర్పాటు చేసిన ఆర్టీసీ రిక్వెస్ట్ స్టాప్‌ను సోమవారం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తంగిరాల సౌమ్య ప్రారంభించారు. నందిగామ పీఏసీఎస్ చైర్మన్ కొట్టే హరికృష్ణ (బద్రి) సహకారంతో ఈ స్టాప్ ఏర్పాటైంది. దీంతో గ్రామస్థులకు మెరుగైన రవాణా సౌకర్యం లభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.