ASR: కొయ్యూరు మండలం రత్నంపేటకు చెందిన కొమరాపు శివాజీ నకిలీ ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రంతో రిజర్వేషన్ ప్రయోజనాలు పొందారని పీ. చంద్రశేఖర్ ఆరోపించారు. ఈ మేరకు, సోమవారం కొయ్యూరు తహశీల్దార్ ప్రసాదరావుకు ఫిర్యాదు చేశారు. తన తండ్రి వివరాలను మార్చి ఎస్టీ సర్టిఫికెట్ పొందారని, దానితో వైద్య విద్య పూర్తి చేశారన్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'నకిలీ సర్టిఫికెట్‌తో ఎంబీబీఎస్ పూర్తి'


