హైదరాబాద్: 28°C
తెలంగాణ

సమ్మక్క బ్యారేజ్ నీటి తరలింపుపై హరీష్‌రావు మండిపాటు

SDPT: దేవాదుల నుంచి నీళ్లు సరిగా ఎత్తిపోయక పోవడం వల్లే వరంగల్ జిల్లాలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సమ్మక్క బ్యారేజ్ ద్వారా నిత్యం 30 వేల క్యూసెక్కుల నీళ్లు ఏపీకి తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మోటర్ల నిర్వహణ లోపం వల్ల బేరింగులు దెబ్బతిన్నాయని, మిగిలినవి కూడా సరిగా నడవడం లేదని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.