హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాజమండ్రి మెడికల్ కాలేజీలో ఘనంగా ఆర్థరైటిస్ సదస్సు

E.G: ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవం సందర్భంగా సోమవారం రాజమండ్రి ప్రభుత్వ వైద్య కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. కీళ్ల ఆరోగ్యానికి రోజూ వ్యాయామం, సమతుల ఆహారం, సరైన బరువు అవసరమని ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.ఎస్. రాజు మాట్లాడారు. నొప్పులు, వాపులు, బిగుతుదనం ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్లను సంప్రదించాలని డాక్టర్ చంద్రశేఖర్ సూచించారు.