హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటు హక్కుల పరిరక్షణకు కాంగ్రెస్‌ ర్యాలీ

SRD: రాహుల్ గాంధీ పోరాటానికి మద్దతుగా జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డిలో కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ ఓటు హక్కుల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.